BREAKING
కార్తీక మాసంలో సలుగుపల్లిలో ఆధ్యాత్మిక శోభ కంబదూర్ ఎంపీపీ పీఠంపై తీవ్ర ఉత్కంఠ. తోటలో మిర్చి దొంగతనం.. రైతుకు బారి నష్టం. ఎన్విడియాకు ఎదురుదెబ్బ, చైనాకు భారీ లాభం జార్ఖండ్ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు విక్కీ కౌశల్ నా గందరగోళానికి శాంతి.. బిజినెస్, మాతృత్వంపై కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు భగవాన్ బిర్సా ముండా జయంతి...నివాళులర్పించిన ప్రధాని మోదీ పదవుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ ఒప్పందం రామాయణంలో భరతుడి పాత్ర కోసం తొలుత లక్ష్మణుడికి ఆడిషన్.. స్కూల్ రోజుల జ్ఞాపకాలు పంచుకున్న ఆదినాథ్ కొఠారే అమెరికా కాంగ్రెస్‌లో ఇంధన అనుమతుల బిల్లుపై రాజకీయ వేడి రామాయణ చిత్రంపై అనన్య పాండే ప్రశంసలు.. మైథాలజీ సినిమాల్లో నటించే ఆసక్తి ఉందంటూ వ్యాఖ్యలు క్లినికల్ ట్రయల్స్‌లో సంచలన ఫలితాలు సాధించిన ఎలి లిల్లీ మందులు ప్రముఖ సంగీత దర్శకుడు పి. విజయ శేఖర్ కన్నుమూత.. నెల్లూరులో విషాదం అమెరికాలో తగ్గిన డీజిల్ ధరలు

కంబదూర్ ఎంపీపీ పీఠంపై తీవ్ర ఉత్కంఠ.

Select Suryaa Now
కంబదూర్ ఎంపీపీ  పీఠంపై తీవ్ర ఉత్కంఠ.

కంబదూరు:  మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం ఎవరిని వరించనుందన్న అంశం మండల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ పదవిని ఆశిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తిమ్మాపురం గ్రామ ఎంపీటీసీ-2గా విజయం సాధించిన ఓబగానిపల్లి సుబ్బరాయుడు, మర్రిమాకులపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన దేకు తిమ్మక్క మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నెల 19న ఎంపీపీ అభ్యర్థి ఎంపికకు పరోక్ష ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాల నేపథ్యంలో మండల పరిషత్ పదవుల పంపకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జెడ్పీటీసీ స్థానానికి మర్రిమాకులపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని గుద్దెళ్ల గ్రామానికి చెందిన వేముల శారద చౌదరి విజయం సాధించడం రాజకీయ సమీకరణాల్లో కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మండల స్థాయిలోనూ సామాజిక, రాజకీయ సమతుల్యత పాటించాలనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో తిమ్మాపురం ఎంపీటీసీ-2గా ఎన్నికైన ఓబగానిపల్లి సుబ్బరాయుడికి ఎంపీపీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ మండలవ్యాప్తంగా సాగుతోంది. ఓబగానిపల్లి సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా, నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీ పట్ల విధేయతతో వ్యవహరిస్తూ దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, సీనియారిటీ తనకు అనుకూలంగా మారుతాయని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మండల రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడికి అవకాశం కల్పిస్తే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్రిమాకులపల్లి ఎంపీటీసీగా విజయం సాధించిన దేకు తిమ్మక్క కూడా ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆమెకు అవకాశం కల్పించాలనే అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు ఆశావహుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఎవరికి పార్టీ అధిష్టానం మద్దతు లభిస్తుందన్న అంశంపై నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎంపీపీ పదవికి పరోక్ష ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ కంబదూరు మండల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నెల 19న జరగనున్న ఎన్నికలో పార్టీ నిర్ణయం కీలకం కానుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికి ఆశీస్సులు అందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా? లేక ఇతర రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఎంపీపీ పీఠం కోసం సుబ్బరాయుడు, దేకు తిమ్మక్క మధ్య నెలకొన్న పోటీ కంబదూరు మండల రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. అధిష్టానం తీసుకునే తుది నిర్ణయంపై మండల ప్రజలు, పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.