BREAKING
తోటలో మిర్చి దొంగతనం.. రైతుకు బారి నష్టం. ఎన్విడియాకు ఎదురుదెబ్బ, చైనాకు భారీ లాభం జార్ఖండ్ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు విక్కీ కౌశల్ నా గందరగోళానికి శాంతి.. బిజినెస్, మాతృత్వంపై కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు భగవాన్ బిర్సా ముండా జయంతి...నివాళులర్పించిన ప్రధాని మోదీ పదవుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ ఒప్పందం రామాయణంలో భరతుడి పాత్ర కోసం తొలుత లక్ష్మణుడికి ఆడిషన్.. స్కూల్ రోజుల జ్ఞాపకాలు పంచుకున్న ఆదినాథ్ కొఠారే అమెరికా కాంగ్రెస్‌లో ఇంధన అనుమతుల బిల్లుపై రాజకీయ వేడి రామాయణ చిత్రంపై అనన్య పాండే ప్రశంసలు.. మైథాలజీ సినిమాల్లో నటించే ఆసక్తి ఉందంటూ వ్యాఖ్యలు క్లినికల్ ట్రయల్స్‌లో సంచలన ఫలితాలు సాధించిన ఎలి లిల్లీ మందులు ప్రముఖ సంగీత దర్శకుడు పి. విజయ శేఖర్ కన్నుమూత.. నెల్లూరులో విషాదం అమెరికాలో తగ్గిన డీజిల్ ధరలు 40వ డివిజన్‌లో కూలిన చెట్టు తొలగింపు.. యువతకు బ్రిటన్ ప్రభుత్వం తీపికబురు

పదవుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి

Select Suryaa Now
పదవుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం  సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి

చిట్టమూరు మేజర్ న్యూస్

ఈనెల 19న జరగనున్న చిట్టమూరు ఎంపీపీ,మండల పరిషత్ ఉపాధ్యక్షులు,కోఆప్షన్ సభ్యుల ఎంపిక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు స్పష్టం చేశారు. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటు జడ్పీటీసీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. విజయం సాధించిన ఎంపీటీసీలు,జడ్పీటీసీకి శుభాకాంక్షలు తెలిపారు.ఇటీవల సోషల్ మీడియా వేదికగా గెలుపొందిన ఎంపీటీసీలలో ఎంపీపీ,వైస్ ఎంపీపీ,కోఆప్షన్ సభ్యుల ఎంపికపై వస్తున్న కథనాలను నమ్మవద్దని ఆయన కోరారు. ఈ విషయంపై ఎవరూ అనవసరమైన ప్రచారాలకు, ఊహాగానాలకు పాల్పడవద్దని సూచించారు.మండలంలో కీలక పదవుల కేటాయింపు గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మరియు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని,పార్టీ ఐక్యతను కాపాడాలని గణపర్తి కిషోర్ నాయుడు వీడియో రూపంలో విజ్ఞప్తి చేశారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్