BREAKING
దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

బీఆర్‌ఎస్‌–టీఆర్‌ఎస్‌–బీజేపీ తోడుదొంగలు! అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకాలు ఆడుతోంది

Select Suryaa Now
బీఆర్‌ఎస్‌–టీఆర్‌ఎస్‌–బీజేపీ తోడుదొంగలు!  అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకాలు ఆడుతోంది

సిద్దిపేట అర్బన్, : బీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నాయని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం కొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని, ప్రజలు వారి మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన సూచించారు.సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో అత్తు ఇమామ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన కవిత ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. బయటకు ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, వారంతా ఒకే కల్వకుంట్ల కుటుంబానికి చెందినవారేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, కవిత పార్టీ, బీజేపీ మధ్య అంతర్గత రాజకీయ అవగాహన ఉందని, తిరిగి కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకురావడమే వారి లక్ష్యమని విమర్శించారు.పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, మళ్లీ అధికారం చేపట్టి ప్రజల సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందేందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తుచేశారు. అయినప్పటికీ మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి రాజకీయ నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు.కవిత సిద్దిపేట పేరును రాజకీయంగా ఉపయోగించుకున్నారే తప్ప, పట్టణ అభివృద్ధికి చేసిన కృషి ఏమిటని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో మార్పు కోరుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని అన్ని వార్డుల్లో గెలిపిస్తే పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ నెల 29న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అత్తు ఇమామ్ పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో గ్యాదారి మధు, గయాజుద్దీన్, ఫయాజ్, నవాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.