అనాధలకు దుప్పట్లు పంపిణీ
ఆత్మకూరు/మేజర్ న్యూస్; ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి సందర్భంగా పేదవారికి దుప్పట్ల పంపిణీ చేసినట్లు సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. మానవసేవయే మాధవసేవ అనీ వారు తెలిపారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాలలోని పేదవారికి దుప్పట్ల పంపిణీ కొనసాగినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు నవీన్ ,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.