బాపట్ల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి ఏకగ్రీవ ఎన్నిక బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జెడ్పిచైర్మన్ పూషడపు రోహిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె కూటమి
బాపట్ల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి ఏకగ్రీవ ఎన్నిక
బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జెడ్పిచైర్మన్ పూషడపు రోహిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె కూటమి జేడ్పిచైర్మన్ లు మద్దత్తు తో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి., ఐఏఎస్ జడ్పీటీసీ జిల్లా చైర్మన్ తో పాటు సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగన సత్యప్రసాద్ జడ్పీ సీఈఓ సీహెచ్ విజయలక్ష్మి, ఆర్డీఓ ఏ. హరికుమార్, తహశీల్దార్ షేక్ సలీమా, జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.