చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం వైస్ ఎంపీపీగా చంద్రగిరి నాలుగోవ సెగ్మెంట్లో విజయం సాధించిన సునీల్ కు పదవి దక్కింది. మండల పరిషత్ ఎంపీపీ ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంపీపీగా కాలరోడ్డుపల్లి ఎంపీటీసీ సరిత రమణమూర్తి ప్రమాణ స్వీకారం చేయగా. అనంతరం జరిగిన వైస్ ఎంపీపీ ఎన్నికల్లో చంద్రగిరి నాలుగోవ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన సునీల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కి రుణపడి ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే నాని తనకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.