వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం
సూర్య మంచిర్యాల టౌన్:
మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో నాణ్యమైన సరుకుల సరఫరా (నాన్-కాస్ట్ సరుకులు)తో పాటు ఇతర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి గృహాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మొహసిన్, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.