శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య.
**శెట్టూరు:** మండలంలోని ఐదుకల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఐదుకల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోయ కమలమ్మకు మద్దతుగా ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో బోయ కమలమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలారి రంగయ్య గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని పలువురు ఓటర్లను కలిసి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తలారి రంగయ్య పర్యటనతో ఐదుకల్లు గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.