రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక
శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండవసారి ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి నూతన ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో వాయిదా వేసి తదుపరి చర్యల గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు రిటర్నింగ్ అధికారి సూర్య శేఖర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి, మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికల నిమిత్తం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి నిర్దేశిత సమయంలో నూతన ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో నిబంధనల మేరకు వాయిదా వేసినట్లు వారు తెలిపారు..