BREAKING
ధనుష్ ‘ఓం’ మూవీ రివ్యూ.. అంచనాలు అందుకుందా? బాపట్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా కలవకూరి పిచ్చమ్మ ఏకగ్రీవ ఎన్నిక గోళ్ల లో కీర్తిశేషులు బాదన్న ఆశీర్వాదంతో ప్రచారాన్ని మొదలుపెట్టిన సర్పంచ్ అభ్యర్థి. బాపట్ల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా పూషడపు రోహిణి ఏకగ్రీవ ఎన్నిక బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జెడ్పిచైర్మన్ పూషడపు రోహిణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె కూటమి రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్ కార్లు.. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త ప్లాన్ అనాధలకు దుప్పట్లు పంపిణీ చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్ నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య. వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రతినిధులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్.

గోళ్ల లో కీర్తిశేషులు బాదన్న ఆశీర్వాదంతో ప్రచారాన్ని మొదలుపెట్టిన సర్పంచ్ అభ్యర్థి.

Select Suryaa Now
గోళ్ల లో కీర్తిశేషులు బాదన్న ఆశీర్వాదంతో ప్రచారాన్ని మొదలుపెట్టిన సర్పంచ్ అభ్యర్థి.

కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లక్ష్మీ ప్రసన్న చంద్రనాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా బాదన్న సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాదన్న ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆమె తెలిపారు. గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. గోళ్ళ గ్రామానికి చెందిన ఆడబిడ్డగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీ రమేష్ పాల్గొని లక్ష్మీ ప్రసన్న చంద్రనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మద్దతుతో విజయం సాధించి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభ్యర్థికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారాన్ని ప్రారంభించడంతో గోళ్ళ గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.