BREAKING
రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్ కార్లు.. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త ప్లాన్ అనాధలకు దుప్పట్లు పంపిణీ చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్ నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య. వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రతినిధులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్. డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి : పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల నాయకులు టీ కొట్టులో క్లీనర్‌గా మొదలైన జీవితం.. నేడు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత! వాడరేవు సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణ నామినేషన్ దాఖలు కివీస్ తో తొలి టెస్టు రెండో రోజు ఆట.. ఓపెనర్ల హాఫ్ సెంచరీలతో భారత్ 159/1

నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం

Select Suryaa Now
నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం

 

మంచాల, : ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు నూతన పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను శుక్రవారం జాపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు కలిపి మొత్తం 33 మందికి నూతనంగా పింఛన్లు మంజూరయ్యాయి. గత పదేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పింఛన్ ద్వారా తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాపాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేతాళ్ల సత్యం సంజీవ, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్మోని పరమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు నోముల కుమార్, సీనియర్ నాయకులు ఓరుగంటి లింగమయ్య, సోప్పరి దశరథ, ఆవుల జగన్, జలంధర్, వార్డు సభ్యుడు నోముల లింగం, భీమయ్య, ప్రశాంత్, ప్రవీణ్, సుమన్, జంగా చారి తదితరులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా.