ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
చౌటుప్పల్: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 9వ వార్డు శివాజీనగర్‌లో ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకునేలా కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జీలు కృషి చేయాలని సూచించారు. రేషన్‌కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో వార్డు ఇన్‌చార్జిని సంప్రదించి నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.