ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వనపర్తి జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు దగ్గరకు వెళ్లి రోగులకు అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.