BREAKING
రెండవసారి వాయిదా పడ్డ ఎంపీపీ ఎంపిక హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్ కార్లు.. ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు సర్కార్ కొత్త ప్లాన్ అనాధలకు దుప్పట్లు పంపిణీ చంద్రగిరి వైస్ ఎంపీపీ గా సునీల్ నూతన పింఛన్లతో లబ్ధిదారుల్లో ఆనందం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శెట్టూరు మండలం ఐదుకల్లు పంచాయతీ లో వైయస్సార్సీపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన డాక్టర్ లారి రంగయ్య. వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్‌కు టీఎన్జీవో నాయకుల వినతిపత్రం బుర్లవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దొంతగుర్ల రాధాకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు జడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ప్రజా ప్రతినిధులతో కలిసి బయలుదేరిన ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్. డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ వెంటనే మంజూరు చేయాలి : పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల నాయకులు టీ కొట్టులో క్లీనర్‌గా మొదలైన జీవితం.. నేడు కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత! వాడరేవు సర్పంచ్ అభ్యర్థిగా పీక్కి నారాయణ నామినేషన్ దాఖలు కివీస్ తో తొలి టెస్టు రెండో రోజు ఆట.. ఓపెనర్ల హాఫ్ సెంచరీలతో భారత్ 159/1

మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్.

Select Suryaa Now
మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్.

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ వివాదంపై రాజకీయ దుమారం!

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: పట్టణంలో ఎగ్జిబిషన్ నిర్వహణ, నిధుల వ్యవహారం చుట్టూ సాగుతున్న రాజకీయ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన విమర్శలకు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎగ్జిబిషన్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజాధనానికి నష్టం జరిగితే ఎంతటి వారిపైనైనా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని వై.ఎం.ఆర్. కాలనీలో తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2019లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలుపొందిన నాటి నుంచే ఎగ్జిబిషన్ వ్యవహారంపై వివాదం ప్రారంభమైందని ఆరోపించారు. గతం లో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన డబ్బులు ఎగవేయలేదా? అని గుర్తు చేశారు. బంగారు రెడ్డి కుమారుడు, రాచమల్లు సోదరుడి కుమారుడు సైతం ఎగ్జిబిషన్‌కు వచ్చి వినోద కార్యక్రమాలను వీక్షించి వెళ్లిన విషయం మాజీ ఎమ్మెల్యేకు తెలియదా అని ప్రశ్నించారు. అదేవిధంగా డీఏడబ్ల్యూ కళాశాల, ఎస్ఎస్ మాల్ వ్యవహారాల్లో వాటాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించి బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలకు దిగేటప్పుడు కనీస సంయమనం, గౌరవ ప్రదమైన భాష ఉపయోగించాలని  హితవు పలికారు. గత మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల సమయంలో ప్యాకేజీ మాట్లాడుకుని పోరెడ్డి నరసింహారెడ్డిని ఇబ్బందులకు గురిచేశారని ప్రవీణ్ ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో తప్పులు జరిగితే ప్రశ్నించడం తన బాధ్యతని పేర్కొన్నారు. తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. తన ధైర్యం, పోరాట పటిమ ఏమిటో గతంలోనే నిరూపించుకున్నానని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, కడప జిల్లా కలెక్టర్ పనితీరుపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో పనిచేసిన కలెక్టర్లతో పోలిస్తే ప్రస్తుత జిల్లా కలెక్టర్ పరిపాలనలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులకు కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉండేది కాదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు సైతం కలెక్టర్‌ను స్వేచ్ఛగా కలిసి తమ సమస్యలను వివరించే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పనితీరును విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, కలెక్టర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యేకు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.