అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
పోలీసులు లేని సమాజాన్ని ఎవరూ ఊహించలేరని.. శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో ఎందరో పోలీసులు అమరులయ్యారని.. విధి నిర్వహణలో అశువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలు స్థిరంగా ఉంటేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్ధవంతం గా చేరుతాయన్నారు. ప్రజల భద్రత కోసం పోలీ సులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విప త్తులు, పండుగలు, ఎన్నికలు వంటి అన్ని సందర్భాల్లో పోలీసులు ముందుండి సేవలందిస్తు న్నారని.. వారి సేవలు, త్యాగాలు అమూల్యమై నవని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్ల ప్పుడూ ముందుంటారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశాభివృద్ధికి శాంతి, స్థిరత్వం, సామాజిక సమైక్యత అవసరమని.. పోలీసు వ్యవస్థ వాటిని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. అంతకుముందు ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు సాయుధ దళాలు సంప్రదాయ స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం పరేడ్ కమాండర్ దేశవ్యాప్తంగా వివిధ సంఘట నల్లో అమరులైన పోలీసుల జాబితాను అందజేయగా.. అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అమరుల పేర్లను చదివి వినిపించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు అమరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తూ కంటతడి పెట్టుకున్నారు. తమ వారిని గుర్తు చేసుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అనంతరం పట్టణ పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు,డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్