BREAKING
అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!! మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు దండా బత్తుల నరేష్* ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

ఆత్మీయ మిత్రుడు రోకటి ఇంటికి మంత్రి తుమ్మల

Select Suryaa Now
ఆత్మీయ మిత్రుడు రోకటి ఇంటికి మంత్రి తుమ్మల

సూర్య,జూలూరుపాడు రాజకీయ ప్రస్థానం ఆరంభం నుంచి నేటి వరకు కలిసి సాగుతున్న ఆత్మీయ మిత్రుడిని పలకరించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రోకటి రంగారావు ఇంటికి వెళ్లారు.ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తనను కలవలేకపోతున్న మిత్రుడి వద్దకే వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు.ఈ ఆత్మీయ పలకరింపు పాలకొల్లు గ్రామంలో ప్రత్యేకంగా నిలిచింది.

జూలూరుపాడు సమీపంలోని పాలకొల్లు గ్రామంలో నివాసముంటున్న తన ఆత్మీయ మిత్రుడు రోకటి రంగారావు ఇంటికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా వెళ్లారు.జూలూరుపాడు సీతారామ టన్నెల్ పనులను పరిశీలించేందుకు వెళుతున్న క్రమంలో రంగారావు నివాసానికి చేరుకున్న మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యాయంగా పలకరిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అనంతరం రంగారావు, ఆయన కుటుంబ సభ్యులతో చాలాసేపు ముచ్చటించారు.తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి రోకటి రంగారావు ఆయనతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం కొనసాగుతూ వస్తోంది.అనారోగ్య కారణాలతో రంగారావు మంత్రి తుమ్మలను కలవలేకపోతున్న నేపథ్యంలో, ఆయనే స్వయంగా మిత్రుడి ఇంటికి వచ్చి పలకరించడం కుటుంబ సభ్యులను ఆనందానికి గురిచేసింది.

సాధారణంగా బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు తమ కార్యక్రమాల నడుమ పాత మిత్రులను కలవడం అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే, ఆరోగ్య సమస్యలతో ఉన్న మిత్రుడి పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లడం స్నేహానికి ఉన్న విలువను మరోసారి గుర్తుచేసింది. పదవులు, రాజకీయ బాధ్యతలు, అధికారిక కార్యక్రమాలు ఎలా ఉన్నా, ఏళ్ల తరబడి కొనసాగిన ఆత్మీయ బంధాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ ఘటన చాటిచెప్పింది.మంత్రి తుమ్మల రాకతో రోకటి రంగారావు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంట వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌తో పాటు వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు,తుమ్మల అభిమానులు ఉన్నారు.

సూర్య రిపోర్టర్ సిద్ధిక్ జూలూరుపాడు