BREAKING
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్

Select Suryaa Now
వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ టోర్నమెంట్

సూర్య మంచిర్యాల టౌన్ : తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వోడపెల్లి శ్రీనాథ్ బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఎస్ఎస్ఎమ్ స్కూల్ ఆవరణలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.టోర్నమెంట్‌లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో కీర్ని శ్రీనివాస్–నాగుల వెంకటేష్ జోడీ విజేతగా నిలవగా, మైలగాని శ్రీనివాస్–రాపోలు సాగర్ రావు జోడీ రన్నరప్‌గా నిలిచింది. సంగా శేఖర్ బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యారు.టోర్నమెంట్ నిర్వాహకుడు వోడపెల్లి శ్రీనాథ్ మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని అభినందించారు.గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడం ముఖ్యమన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ చివరి వరకు పట్టుదలతో పోరాడటమే నిజమైన విజయమని తెలిపారు.విజేతలకు అందించిన బహుమతులు వారి ప్రతిభకు గుర్తింపుగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు స్పాన్సర్లను సమీకరించి విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ప్లేయర్ రావుల నగేష్‌ను క్రీడాకారులు అభినందించారు. క్రీడాకారులకు మంచి వేదిక కల్పించేందుకు స్పాన్సర్లను ముందుకు తీసుకువచ్చిన క్రీడాకారులు నగేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రావుల నగేష్ మాట్లాడుతూ, నాలుగు రోజులుగా నిర్వహించిన బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహంగా, పోటాపోటీగా విజయవంతంగా సాగడం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తండ్రి జీవితానికి తొలి గురువు, మార్గదర్శి, విజయాల వెనుక నిలిచే నిశ్శబ్దమైన బలమని పేర్కొన్నారు. తండ్రి జ్ఞాపకాలను హృదయంలో పదిలంగా ఉంచుకుని ఆయన పేరుతో క్రీడా కార్యక్రమం నిర్వహించడం శ్రీనాథ్‌కు తండ్రిపై ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనమన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు వారికి మంచి వేదిక కల్పించాలనే ఉద్దేశంతో స్పాన్సర్లను సమీకరించినట్లు నగేష్ తెలిపారు. క్రీడలకు సమాజం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే యువతలో ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తి పెరుగుతుందని అన్నారు.

క్రీడాకారుడు పెట్టం మల్లేష్ మాట్లాడుతూ.. వోడపెల్లి రాజేందర్ జ్ఞాపకార్థం ఇలాంటి క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా స్నేహభావం, ఐక్యత పెంపొందుతాయని, భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలని ఆకాంక్షించారు. విజేత కీర్ని శ్రీనివాస్ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. పోటీలను చక్కగా నిర్వహించిన నిర్వాహకులు, స్పాన్సర్ వోడపెల్లి శ్రీనాథ్, సహకరించిన రావుల నగేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పోటీలు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు బైరి సుమన్, పెట్టం మల్లేష్, తిరుపతి, సురేష్, మహేందర్, సతీష్, వెంకటేష్, గాలయ్య, రాజు, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా ముగియడంతో క్రీడాకారులు, నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.