మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం
కందుకూరు మున్సిపాలిటీకి 14 ఏళ్ల నుంచి విలీన గ్రామాల సమస్యతో ఎన్నికల జరగటం లేదు. తాజాగా రాష్ట్ర హైకోర్టు ఈ సమస్యపై ఉన్న అన్ని కేసులను కొట్టివేస్తూ ఎన్నికలకు మార్గాన్ని సుగుమం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేసిన కృషికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను పలువురు నాయకులు కలిసి ఘనంగా సత్కరించారు.