దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ
దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ కాళికామాత దేవస్థానము నందు ఈ నెల 11వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించబడుతున్న దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.11వ తేదీ కలశస్థాపనతో ప్రారంభించి 16 వ తేదీన బిందె సేవ, 18 వ తేదీన దుర్గాష్టమి, 20వ తేదీ విజయదశమి రోజున గ్రామోత్సవం,21వ తేదీ వసంతోత్సవం మరియు అన్నప్రసాద వితరణతో ఉత్సవాలు ముగుస్తాయని, ఈ నవరాత్రులలో ప్రతిరోజూ సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునని అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయబడినదని కావున భక్తులు ఈ నవరాత్రులలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ కాళికామాత వారి అనుగ్రహానికి పాత్రులుకాగలరని దేవస్థాన కమిటీ అధ్యక్షులు యద్దనపూడి శ్రీనివాసచార్యులు మరియు ఉపాధ్యక్షులు ముత్తలూరు సురేష్ ఆచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవాధ్యక్షులు కోటేశ్వరరావు ఆచార్యులు, పెద్ద సుబ్బయ్య ఆచార్యులు, చిన్న పుల్లయ్య ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి యాడికి గోపాలచార్యులు, క్యాషియర్ రామ్మోహన్ ఆచార్యులు, గుండ్లకుంట సుబ్బయ్య ఆచార్యులు, సుబ్రహ్మణ్యం ఆచార్యులు, దేవస్థాన పురోహితులు చంద్రశేఖర ఆచార్యులు, వెంకటేశ్వర ఆచార్యులు, పురుషోత్తమాచార్యులు, దేవ పూజ హరికృష్ణ ఆచార్యులు, మరియు దేవస్థాన మహిళా కమిటీ అధ్యక్షురాలు కమ్మరి విశాలక్ష్మి , ఉపాధ్యక్షురాలు పన్నీరు పుల్లమ్మ, ప్రధాన కార్యదర్శి హరీషా దేవి, సభ్యురాలు ఉదయభాను, సావిత్రమ్మ ,శ్రీదేవి, జమీల తదితరులు పాల్గొన్నారు