BREAKING
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే! సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు

పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత.

Select Suryaa Now
పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత.

 

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-

 

ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యను కొనసాగించలేని పేద విద్యార్థికి ఆరా ఇగ్నైట్స్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుండటంతో కుటుంబ పోషణకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చులను భరించే స్థోమత లేకపోవడంతో విద్యార్థి చదువు కొనసాగింపుపై ఆందోళన చెందుతున్నాడు. ఈ విషయం ఆరా ఇగ్నైట్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల దృష్టికి రావడంతో వారు విద్యార్థి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, ఆర్థిక ఇబ్బందులను పరిశీలించారు. విద్యార్థి చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్రస్ట్ తరఫున విద్యార్థికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, ఉన్నత చదువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థికి భరోసా కల్పించారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని చదువు కొనసాగించేందుకు చేయూత అందించిన ట్రస్ట్ సభ్యులకు విద్యార్థి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి రాకుండా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యా సహాయం, ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు సమాజంలో అవసరమైన వారికి అండగా నిలిచే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ట్రస్ట్ సేవలను అభినందించారు.