31వ వార్డులో సంక్షేమ సంబరం
లబ్ధిదారులకు సంక్షేమ చెక్కుల పంపిణీ
సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులు అందజేత
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీ 31వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF), కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, తహసీల్దార వినాయేందర్ రెడ్డి,కౌన్సెలర కడవ నవీన్, వెంపటి సురేష్, ఏపూరి తరుణ్ తదితరులు పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.