బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ
బాపట్ల మండలం బేతపూడి గ్రామానికి చెందిన నాయుడు శ్రీనివాస రెడ్డి(వాసు ) ఇటీవల ప్రమాదవ శాస్తు మృతి చెందటంతో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శించి 30000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు, మృతుడు శ్రీనివాస్ రెడ్డి కి ఇద్దరు పిల్లలు ఉండడంతో మృతుని భార్య నాయుడు అంజలి కి ఔట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇవ్వటం జరుగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బేతపూడి టీడీపీ నాయకులు నాయుడు శ్రీనివాస రెడ్డి, కోట గాంధీ రెడ్డి , సాయిబ్ రెడ్డి, పుల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.