ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం
చీరాల రూరల్: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం దేవాంగపురికి చెందిన నాసిక శివాజీకి ఉత్తమ గ్రంథపాలక పురస్కారం లభించింది. రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గ్రంథపాలకుడిగా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఫ్లయర్స్ చారిటబుల్ ట్రస్ట్, ఏ.సి.టి. అకాడమీ సంయుక్తంగా ఈ పురస్కారం అందజేశాయి. విద్యార్థుల్లో పఠన అలవాట్ల పెంపు, గ్రంథాలయ సేవలు, డిజిటల్ విద్యా వనరుల వినియోగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించారు. శివాజీని విద్యాసంస్థల చైర్మన్ ఇస్కాల రంగమన్నార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి. సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు