BREAKING
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

వికారాబాద్ జిల్లాలో వర్షాభావం

Select Suryaa Now
వికారాబాద్ జిల్లాలో వర్షాభావం

15 మండలాల్లో లోటు వర్షపాతం.. 4 మండలాల్లో సాధారణం
బొంరాస్‌పేటలో మాత్రం 26 శాతం అధిక వర్షం.. జిల్లా సగటు 29 శాతం లోటు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్ 4):వికారాబాద్ జిల్లాలో వర్షపాతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్టోబర్ 4 నాటికి జిల్లాలో నమోదైన వర్షపాత గణాంకాల ప్రకారం 20 మండలాల్లో 15 మండలాలు లోటు వర్షపాతంలో ఉండగా, 4 మండలాల్లో సాధారణ వర్షపాతం, ఒక మండలంలో అధిక వర్షపాతం నమోదైంది.
జిల్లా మొత్తంగా ఇప్పటివరకు 474.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి 671.6 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 197.2 మి.మీ. తక్కువగా నమోదైంది. దీంతో జిల్లా సగటు వర్షపాతం 29 శాతం లోటుగా ఉంది.
15 మండలాల్లో లోటు
అత్యధికంగా మర్పల్లిలో 50 శాతం, బంట్వారంలో 55 శాతం, పెద్దేముల్‌లో 53 శాతం, దోమలో 47 శాతం, బషీరాబాద్‌లో 47 శాతం లోటు నమోదైంది.
ఇతర మండలాల్లో..
మర్పల్లి – 50% లోటు
మోమిన్‌పేట – 25% లోటు
నవాబ్‌పేట – 25% లోటు
పరిగి – 41% లోటు
కుల్కచర్ల – 40% లోటు
దోమ – 47% లోటు
ధారూర్ – 29% లోటు
కొటేపల్లి – 26% లోటు
బంట్వారం – 55% లోటు
పెద్దేముల్ – 53% లోటు
తాండూర్ – 34% లోటు
బషీరాబాద్ – 47% లోటు
యాలాల్ – 22% లోటు
కొడంగల్ – 37% లోటు
దౌల్తాబాద్ – 29% లోటు
నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం
వికారాబాద్ (-8%), పూడూరు (-11%), చౌడాపూర్ (-7%), దుడ్యాల (-15%) మండలాల్లో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదైంది.
బొంరాస్‌పేటలో అధిక వర్షపాతం
జిల్లాలో బొంరాస్‌పేట మండలం మాత్రమే అధిక వర్షపాతం నమోదు చేసింది. సాధారణ వర్షపాతం 522.8 మి.మీ. కాగా, ఇప్పటివరకు 658.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో 26 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అక్టోబర్ 4న జిల్లాలో సాధారణంగా 6.8 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఏ మండలంలోనూ వర్షం నమోదు కాలేదు. దీంతో ఆ రోజు వర్షపాతం లోటు -100 శాతంగా నమోదైంది.
రైతుల్లో ఆందోళన: జిల్లాలో ఇప్పటికే వర్షపాతం లోటు కొనసాగుతుండగా, అక్టోబర్‌లోనూ వర్షాలు కురవకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశిస్తున్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.