వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు.
వెంకటాపురం నూగూరు,అక్టోబర్ 02, మేజర్ న్యూస్ సూర్య: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వేదికపై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ సత్యం,అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు.నేటి సమాజంలో నెలకొన్న విద్వేషాలకు విరుగుడు గాంధీజీ చూపిన మార్గమేనని, ప్రతి కార్యకర్త గాంధీ బాటలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్టెం సాయి,సీనియర్ నాయకులు బాలసాని మధు,శ్రీరాముల రమేష్, డర్ర రవి, మద్దుకూరి ప్రసాద్,గుండమల్ల కిరణ్, గాందెర్ల నాగేశ్వరరావు,యాసం శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.