గాంధీజీ ఆశయాలే నేటితరానికి మార్గదర్శకం
కౌన్సిలర్ హనుమాన్ దాస్ గౌడ్
యాడారంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్02):
అలియాబాద్ మున్సిపాలిటీ పరిది లోని యాడారం గ్రామంలో మహాత్మా గాంధీ 157 వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 12 వ వార్డు కౌన్సిలర్ హనుమాన్ దాస్ గౌడ్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను గాంధీజీ దేశానికి చూపించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తురాయి వెంకటేష్, లక్ష్మణ్, సాయిబాబా, అనంతరెడ్డి,రాముగౌడ్, శంకరయ్య, రాజు రెడ్డిభాను గౌడ్, వినోద్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.