BREAKING
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మీరు మా ఏపీ ముద్దుబిడ్డ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఆత్మకూరులో ఘనంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవం గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి మన్నవరప్పాడు లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అద్దంకి అభివృద్ధికి పెద్దపీట ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు ఘనంగా జయంతి వేడుకలు యాదగిరిగుట్టలో భక్తజన సందోహం రూ.10 కోట్లకు చేరువలో సర్వేపల్లి సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ - మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన

రోడ్డు భద్రతపై వాహనదారులకు ఎల్ కోట పోలీసుల అవగాహన

Select Suryaa Now
రోడ్డు భద్రతపై వాహనదారులకు ఎల్ కోట పోలీసుల అవగాహన

 

లక్క వరపు కోట , అక్టోబర్ 2 మేజర్ న్యూస్ :

 

లక్కవరపుకోట మండలం రంగరాయపురం గ్రామం వద్ద విశాఖపట్నం–అరకు ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్టాపర్ల వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై గాంధీ జయంతి సందర్బంగా పోలీసులు అవగాహన కల్పించారు. శుక్రవారం ఎల్.కోట ఎస్‌ఐ జె. రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది రోడ్డు భద్రతకు సంబంధించిన గోడపత్రికలను ప్రదర్శిస్తూ వాహనదారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ వాహనదారులు సురక్షిత ప్రయాణం కోసం తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నిర్ణీత వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.