BREAKING
టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం

మీరు మా ఏపీ ముద్దుబిడ్డ

Select Suryaa Now
మీరు మా ఏపీ ముద్దుబిడ్డ

అనంత్ అంబానీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు

-మదనపల్లెలో రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

-నన్ను ఏపీ బిడ్డగా చూడాలంటూ అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం

-ఎమోషనల్ గా స్పందించిన చంద్రబాబు

-కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మల, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

-రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ భాగస్వామ్యం కావాలని సీఎం ఆకాంక్ష

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

"అనంత్ అంబానీ... మీరు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ" అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం, ముఖ్యమంత్రి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి అభినందించి, ఆప్యాయంగా హత్తుకోవడం సభలో ఉన్నవారిని ఆకట్టుకుంది.

అంతకుముందు, సభలో ప్రసంగించిన అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించాలని, రాష్ట్ర అభివృద్ధికి తాను ఏం చేయాలో మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఆయన ప్రసంగానికి సభికుల నుంచి విశేష స్పందన లభించింది. అనంత్ ప్రసంగం ముగియగానే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆయనను అభినందించారు.

అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంత్ అంబానీ మాటలపై స్పందించారు. "అనంత్ అంబానీని మన రాష్ట్ర ముద్దుబిడ్డగా భావిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింతగా భాగస్వామి కావాలి" అని వేదికపై నుంచి ప్రకటించారు.

మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేశ్ కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.40 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉద్యాన రంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, ఆధునిక సాగు విధానాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి బాటలు పడతాయని ప్రభుత్వం వివరించింది.

కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలు మొక్కలు నాటారు. ఉద్యాన రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.