ఘనంగా జయంతి వేడుకలు
ఇరగవరం మేజర్ న్యూస్ :జాతి పిత మహాత్మా గాంధీని స్మరణకు తెచ్చుకోవడం దైవ కార్యంవంటిదని కత్తవపాడు,కంతేరు,పొదలాడ గ్రామాల సోసైటీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కత్తవపాడు సచివాలయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు. యావత్తు జాతి గర్వించదగిన వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు. అయన పోరాట ఫలమే భారత దేశం అన్నారు. అయన అడుగుజాడల్లో నడిచి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి అధికారి వెంకట నారాయణ,పంచాయితీ కార్యదర్శి నరేష్,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
దొరబాబు ఇరగవరం