గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్
వింజమూరు మేజర్ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిసందర్భంగాసొసైటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులుచల్లావెంకటేశ్వర్లు యాదవ్ స్థానికనేతలతో కలిసిసొసైటీకార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగాచల్లావెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ బాపూజీ చూపిన శాంతి, సహనం, సత్యమార్గంలో పయనించి మహాత్ముని ఆశయాల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ అహింస, సత్యం అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడని, ఆయన ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంగాంధీఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం, పారదర్శక పాలన అందిస్తోందన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి చల్లాశ్రీనివాసులు యాదవ్, పట్టణ మాజీ అధ్యక్షులు మంచాల శ్రీనివాసలు నాయుడు, మాజీ సొసైటీ డైరెక్టర్ కర్ణం శ్రీనివాసులు నాయుడు, బీసీ సెల్ నాయకులు నీలం పెరుమాళ్, సొసైటీ సీఈఓ మేకల రమణయ్య, సిబ్బంది రాధా, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.