సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి
వింజమూరు మేజర్ న్యూస్ : వి బి జి రామ్ జి పథకంలో నూతనంగా ప్రవేశపెట్టిన సంస్కరణ వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలని ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి తెలిపారు శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రిలా జయంతిని పురస్కరించుకుని సంస్కరణల ఉత్సవ గ్రామసభను ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభకు ముఖ్యఅతిథిగా ఎంపీడీవో హాజరై గాంధీ లాల్ బహుదూర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకుని వచ్చి వి బి జి రామ్ జి పేరుతో కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు అధికమైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు గతంలో కేవలం జాబ్ కార్డులు ఇవ్వడం పనులు కల్పించడం తప్ప మరొకరకమైన మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం లేకపోయిందని ఆయన తెలిపారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణ వలన పేద ప్రజల సౌకర్యం కోసం మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఈ పథకాన్ని సంస్కరించిందని తెలిపారు అనేక విధాలుగా ఈ పథకం ద్వారా పేద ప్రజలు సౌకర్యాలు పొందుతారని తెలియజేశారు 125 రోజులు గరిష్టంగా ఉపాధి కూలీ కల్పించడం జరుగుతుందని దరఖాస్తు చేసుకున్న15 రోజుల్లోనే ఉపాధి కల్పన వేతనాలు సకాలంలో చెల్లింపు అనుమతించబడిన 375 రకాల పనులు వికసిత్త గ్రామపంచాయతీ ప్రణాళిక వికసిత భారత్ జల జీవన మిషన్ సంస్కరణల ఫలితాలు అందరికీ చెందాలని పనులు కల్పించడంతో అవసరమైన మౌలిక వసతులు ఏర్పడతాయని తెలిపారు సమాజంలోని ప్రతి పౌరునికి అవసరమైన గాలి నీరు అందించడం కోసం పర్యావరణ పరిరక్షణ వన సంరక్షణ నీటి నిల్వలు తదితర అంశాలతో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు అనంతరం సంక్షేమ పథకాలు అమలు తీరుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేశారు గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని గ్రామసభ తీర్మానాలే అభివృద్ధికి పునాది అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కే రామారావు సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.