BREAKING
టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి.. అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి

Select Suryaa Now
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి

రాష్ట్రానికి ఏం చేయగలనో చెప్పండి

-ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌తో రైతులను సీఈఓలుగా మారుస్తామ‌న్న అనంత్‌

-ఏపీలో రూ.1 లక్ష కోట్లతో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న రిలయన్స్

-ఏఐ, డ్రోన్ల టెక్నాలజీతో రైతులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామ‌ని వెల్ల‌డి

-అనంత్ ప్రసంగానికి మంత్రముగ్ధులైన నేతలు

-ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని, రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్న తన సంకల్పాన్ని బలంగా చాటిచెప్పారు. "నన్ను మీ ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయాలో, ఏ సేవ అందించాలో మీరే మార్గనిర్దేశం చేయండి" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన వినమ్రంగా కోరారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్, 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' (ఐఎస్‌ఏ) శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్ అంబానీ చేసిన ప్రసంగం సభికులను, వేదికపై ఉన్న ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు అనంత్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ కూడా ఆయన ప్రసంగాన్ని ప్రశంసించారు.

ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. రాయలసీమలో ఏర్పాటవుతున్న హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఉన్నత ప్రమాణాలతో ఎదుగుతుంది. ఈ సంస్థ ద్వారా అన్నదాతలను వారి కమతాలకే సీఈఓలుగా మారుస్తాం. ఆంధ్రభూమి స్వర్ణభూమిగా మారడం ఖాయం" అని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న 'వికసిత్ భారత్' స్వప్నాన్ని తనలాంటి యువత సాకారం చేసి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో చారిత్రక, జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ.. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ టాగూర్ మదనపల్లెలోనే ఆంగ్లంలోకి అనువదించారని గుర్తుచేశారు. గాంధీజీ సర్వోదయ, అంత్యోదయ నినాదాలను, లాల్ బహదూర్ శాస్త్రి 'జై కిసాన్', వాజ్‌పేయి 'జై విజ్ఞాన్', ప్రధాని మోదీ 'జై అనుసంధాన్' నినాదాలను ఉటంకిస్తూ.. ఈ నాలుగు నినాదాల కలయికతోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేస్తుందని వివరించారు.

టెక్నాలజీ సాయంతో రైతుల ఆదాయం పెంచాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అనంత్ ప్రకటించారు. "ఏఐ, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రెసిషన్ ఫార్మింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తాం. మదనపల్లె టమాటో రైతులు తమ ఉత్పత్తులను ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో చెప్పే వ్యవస్థను రూపొందిస్తాం. రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా అన్నదాతలను 'ఊర్జాదాతలు' (శక్తి ప్రదాతలు)గా మారుస్తాం" అని తెలిపారు.

కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించారు. 'కియో కృషి' ద్వారా రైతులకు జియో పూర్తి సహకారం అందిస్తుందని, 'దేశ్ సేవా-కిసాన్ సేవా' తమ నినాదమని స్పష్టం చేశారు. 'పశు సేవా హీ ప్రభు సేవా' అని తాను విశ్వసిస్తానని, 'వంతారా' ద్వారా జంతు సంరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అద్భుతంగా ఉందని, అందుకే రాష్ట్రం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోందని కొనియాడారు.