వార్షికోత్సవ ఏర్పాట్లపై సర్వసభ్య సమావేశం
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ జోన్-4 సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారు శ్రీనివాసులు, ఏపీ ఎన్జీవో కర్నూలు జిల్లా నాయకులు కాశన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న 13 తేదీ నాటికి సంఘం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రథమ వార్షికోత్సవ ఏర్పాట్లపై సభ్యుల అభిప్రాయాలు సూచనలు స్వీకరించారు.ఉద్యోగుల సమస్యలు, సీనియారిటీ, పదోన్నతులు, జోన్ పరిధిలోని సేవా సమస్యలపై చర్చించారు. సమావేశానికి ముందు జోన్-4 ఆర్జేడీ సురేష్ బాబును కలిసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్జేడీ హామీ ఇచ్చారని, సానుకూలంగా స్పందించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘం నిర్వహణ, సభ్యుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పీఆర్సీ కమిటీ ఏర్పాటు, రెండు డీఏల సాధన, హెల్త్ కార్డులు, పదోన్నతులపై ఉద్యోగుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంఘం ఏర్పాటుకు సహకరించిన రాంబాబు, తిరుపతి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు సురేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి. రమణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, కర్నూలు సిటీ అధ్యక్షులు రామకృష్ణ, కర్నూలు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీకాంత్, ఉమ్మడి కడప నుంచి సురేష్, భాస్కర్, ఉమ్మడి చిత్తూరు నుంచి మునిచంద్ర, మదన్, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జోన్-4 కార్యదర్శి మల్లికార్జున రాజు, జోన్-1 కార్యదర్శి మురళి, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు దుర్గా, రాఘవేంద్ర గౌడ్, మధు స్వామి, ఎం.వి. రమణారెడ్డి, అరుణ కుమారి, బషీర్, రంగస్వామి, భూపాల్, అరుణ్ బాబు పాల్గొన్నారు.