భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాల పూజలు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు శుక్రవారము విశేష పూజా కార్యక్రమాలు, అన్నదానాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన రాహుకాల ఉధ్యాపన పూజలో భక్తులు పాల్గొని, శ్రీ అమ్మవారికి చీరజాకెట్టు, 108 నిమ్మకాయల మాలలను సమర్పించారు. రాహుకాల దీపాలు వెలిగించిన భక్తులతో పాటు, ఆలయానికి విచ్చేసిన ఇతర భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాద పంపిణీ చేశారు.అదేవిధంగా, ప్రతి శుక్రవారం భక్తుల విరాళాల ద్వారా దేవస్థానం తరపున నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం కూడా కొనసాగింది. భక్తులందరూ ఇదే విధంగా ప్రతి శుక్రవారం జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించి సహకరించాల్సిందిగా ఆలయ అధికారులు కోరారు.ఈ విశేష కార్యక్రమాలన్నీ ఆలయ సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు , ఆలయ ఛైర్మన్ ఏలూరు శిరీష, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో జరిగాయి.