పంచాయతీల్లో గ్రామసభలు
ఉదయగిరి,మేజర్ న్యూస్ : మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో సుకుమార్ పాల్గొని మాట్లాడుతూ పీపుల్స్ ప్లాన్ క్యాంఫెయిన్ 2026-27 రిఫార్మ్ ఉత్సవాల్లో భాగంగా ఈ గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందని వారిని గ్రామసభల ద్వారా గుర్తించి అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు సందానీ, బాబు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.