జాతిపితకు ఘన నివాళులు
ఉదయగిరి, మేజర్ న్యూస్ : జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయగిరిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం లో తహసీల్దారు ఎల్.రామ్మోహన్రావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుకుమార్, ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్ డాక్టర్ టీ గోపికృష్ణ ఎంఈవో కార్యాలయంలో ఎంఈవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు ఆధ్యాపకులు, ఉద్యోగులు, నాయకులు, సిబ్బందితో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కరీముల్లా, ఏవో గోపి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, వీఆర్వోలు మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.