BREAKING
ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా ! రాయలసీమ రైతుల తలరాతలు మారబోతున్నాయి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి 167వసారి రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్

కామంచికల్ కూలీల కన్నీటి కష్టం..

Select Suryaa Now
కామంచికల్ కూలీల కన్నీటి కష్టం..

*భారతమ్మ మృతిపై దయాకర్ రెడ్డి సంతాపం

*లారీ ఢీకొని మహిళ మృతి.. 12 మందికి గాయాలు | బాధితులకు అండగా ఉంటామని హామీ

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : కామంచికల్ కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్న విషాద ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంభూరి దయాకర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రఘునాథపాలెం మండలం పంగిడి సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కామంచికల్‌కు చెందిన దొంతు సరుపు భారతమ్మ (55) మృతి చెందడం పట్ల సంతాపం తెలిపారు.
ఒకరి మృతి.. 12 మందికి గాయాలు
పత్తి తీసే పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండగా, 12 మంది కూలీలు గాయపడటంపై దయాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాధితులకు అండగా ఉంటాం
ప్రమాద బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని దయాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.