BREAKING
జిల్లా స్థాయి అవార్డు అందుకున్న కార్యదర్శి అమలాపురంలో దసరా సందడి, చెడీ తాలింఖానా శిక్షణ ప్రారంభం.. పోరాట స్ఫూర్తిని చాటే సంప్రదాయ క్రీడకు సన్నాహాలు యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ,గాంధీ విగ్రహానికి వినతిపత్రం  ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం!

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి : జిల్లా కలెక్టర్ ప్రియాంక

Select Suryaa Now
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి : జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, సూర్యన్యూస్: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ సంగీత అధ్యక్షతన వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ (వీబీజీ రామ్ జీ) ప్రత్యేక గ్రామసభను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా పాఠశాల ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, చిత్ర పటానికి సర్పంచ్ సంగీతతో కలిసి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సామాజిక చిత్రపటం (సోషల్ మ్యాప్), గ్రామంలోని వనరుల చిత్రపటాన్ని పరిశీలించారు. వీబీజీ రామ్ జీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇన్‌చార్జి రాజు గ్రామంలోని వనరులు, శివారు ప్రాంతాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూపొందించిన సోషల్ మ్యాప్, వనరుల మ్యాప్ ద్వారా గ్రామంలో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవచ్చు అని, ప్రతి గ్రామపంచాయతీలో ఏళ్ల తరబడి ఒకే తరహా పనులను చేపట్టకుండా, గ్రామ అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, భవిష్యత్ అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.

*నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి*
నీటి సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఇంటికి వచ్చే వర్షపు నీటిని సంరక్షించడం, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి చర్యలను ప్రజలు అలవర్చుకోవాలన్నారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. తడి, పొడి చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేసి, సక్రమంగా నిర్వహించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాల్సిన సామాజిక బాధ్యత అని తెలిపారు.

*ఉపాధి హామీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలి*
వీబీజీ రామ్ జీ, ఉపాధి హామీ పథకాల కింద గ్రామంలో చేపట్టగల పనులపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బందికి మాత్రమే సమాచారం పరిమితం కాకుండా, గ్రామంలోని ప్రతి కుటుంబానికి పథకాల ద్వారా చేపట్టగల పనులపై వివరాలు తెలియజేయాలన్నారు.
నీటి సంరక్షణ, గ్రామ మౌలిక వసతులు, అవసరమైన భవనాలు, రహదారులు తదితర అభివృద్ధి పనులను ప్రభుత్వ పథకాల ద్వారా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. అవసరమైన కూలీలను సమీకరించి ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

*బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామాలే ముందుండాలి*
ప్రతి గ్రామపంచాయతీని బాల్య వివాహాల రహిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నివారణలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, యువత కీలక పాత్ర పోషించాలన్నారు. 18 సంవత్సరాలు నిండని బాలికలకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని, బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాజాపూర్ గ్రామం ఇప్పటికే పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యా ఫలితాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ తదితర అంశాల్లో ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో నీటి సంరక్షణ, గ్రామాభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలనలోనూ జాజాపూర్ గ్రామం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామసభను సమర్థవంతంగా నిర్వహించిన సర్పంచ్, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు, సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు.
అనంతరం నీటి సంరక్షణ, స్వచ్ఛత, బాల్య వివాహాల నివారణపై సామూహిక ప్రతిజ్ఞ చేశారు. జాజాపూర్ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, డీఆర్‌డీఓ వెంకట్ రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్ గౌడ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్/జిల్లా నోడల్ అధికారి యాదయ్య, ఎంపీఓ బాలాజీ, ఉప సర్పంచ్ లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*