BREAKING
వత్సవాయిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మహాత్మా గాంధీకి ఆర్యవైశ్య సంఘం ఘన నివాళులు మండలంలో 69పాఠశాలల ఎన్నికలు పూర్తి లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు, ఆదర్శాలు యువతకు స్ఫూర్తిదాయకం.. ప్రజా సేవకు చిరునామా : మద్దినేని గాంధీ, శాస్త్రిలకు ఘన నివాళులు ,మహాత్ముడి గ్రామ స్వరాజ్య ఆశయాలను జగనన్న సాకారం చేశారు రైల్వే లైన్ నిర్మాణం నిధుల విడుదలను స్వాగతిస్తున్నాను.. మాజీ పార్లమెంట్ సభ్యులు డా. పి. రవీంద్ర బాబు.. పల్లె పండుగ తో గ్రామ అభివృద్ధికి కొత్త ఊపిరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు జిల్లా స్థాయి అవార్డు అందుకున్న కార్యదర్శి అమలాపురంలో దసరా సందడి, చెడీ తాలింఖానా శిక్షణ ప్రారంభం.. పోరాట స్ఫూర్తిని చాటే సంప్రదాయ క్రీడకు సన్నాహాలు యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ,గాంధీ విగ్రహానికి వినతిపత్రం  ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం,కోడ్ ది బ్రెయిన్, కంట్రోల్ ది మోషన్ పై అవగాహన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి

ప్రతి ఇంటికి సోలార్ ను ఏర్పాటు చేసుకోండి : విద్యుత్ శాఖ డిఈటి రాజు నాయక్

Select Suryaa Now
ప్రతి ఇంటికి సోలార్ ను ఏర్పాటు చేసుకోండి : విద్యుత్ శాఖ డిఈటి రాజు నాయక్

నారాయణపేట, సూర్యన్యూస్ : విద్యుత్ శాఖ ద్వారా శుక్రవారం నారాయణపేట సర్కిల్ ఆఫీసు ఆవరణలో సేవా సేతు అభియాన్ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్తి బిజ్లీ యోజన పథకం ద్వారా ఇంటి మీద సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తు  నిర్మాణం ఎలా ఉత్పత్తి చేయాలి దాన్ని ఎలా వాడుకోవాలి అనే అంశం పై  అవగాహన సదస్సు  ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో  స్థానిక ఎస్.ఈ. బి నవీన్ కుమార్ , డి.ఈ.  టెక్నికల్ ఎస్ రాజు నాయక్  డిఇ ఆపరేషన్ వి శ్రీనివాస్, ఎస్బిఐ బ్యాంకు  ఫీల్డ్ ఆఫీసర్ శరత్ కుమార్ ,  వెండర్స్  మహావీర్ సోలార్  వినయ్ కుమార్ ,  ట్రూ జోన్ సోలార్  డి.చంద్రశేఖర్ ,

నేచురల్ ఎనర్జీ నుండి ఎం. శ్రీకాంత్  మరియు నారాయణపేట నుండి విద్యుత్ వినియోగదారులు అవగాహన సదస్సుకు రావడం జరిగినది. ఈ కార్యక్రమంలో వక్తలు సోలార్ పవర్ గురించి దాని యొక్క వాడకం గురించి మరియు బ్యాంక్ ఆఫీసర్లు లోన్ సౌకర్యం గురించి మరియు వెండార్సు సోలార్ పరికరాల గురించి అవగాహన కల్పించారు.   ప్రకృతి లో జరిగే మార్పుల వల్ల మనిషి విద్యుత్ వాడకము ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నది ఈ సమస్యను అధిగమించాలంటే ప్రకృతి ప్రసాదించినటువంటి సూర్యుని యొక్క శక్తి నుంచి విద్యుత్తు  ఉత్పత్తి చేసుకొని ఎవరి అవసరాలకు తగినట్టు ప్రతి ఒక్కరూ తమ ఇంటి యొక్క అవసరాలకు తమతమ ఇంటి మిద్దె ( రూఫ్) మీద  సోలార్ పలుకలు పెట్టుకుని విద్యుత్తుని వాడుకోవాలని వక్తలు సూచించారు. భూమి మీద మనం జన్మ ఎత్తినందుకు భూమి యొక్క రుణంని కొంతనైనా తీర్చుకోవాలని వక్తలు మాట్లాడినారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సోలార్ ద్వారా సూర్య రష్మిని వినియోగంలోకి తీసుకోవాలని సమావేశంలో అధికారులు సూచించారు. 

సోలార్ ను ఇంటికి ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 78000 సబ్సిడీ ఇస్తుందని 80% బ్యాంకులో రుణాలను5.75%తో రుణాలు మంజూరు మంజూరు చేస్తారని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఒక చిన్న పెట్టుబడితో సోలార్ ను ఏర్పాటు చేసుకొని దాదాపు 25 సంవత్సరాలు కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చని సమావేశంలో మాట్లాడిన వక్తలు  వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు సోలార్ ని ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి ప్రజలు తెలుసుకోవాలని ఈనెల శని, ఆదివారం  లలో కూడా   విద్యుత్ శాఖ టీజీఎస్పీడీసీఎల్, రెడ్ కో మహబూబ్నగర్ శాఖ, ఎస్బిఐ బ్యాంకు, సోలార్ వెండర్స్, రోజూన్ సోలార్ మహావీర్ సోలార్  మరియు నేచురల్ ఎనర్జీ వారు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సోలార్ పలకల యొక్క ఉపయోగాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాము అలాగే బ్యాంకు లోన్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో  పట్టణం ఏఈ లు మహేష్ గౌడ్ , వెంకటకృష్ణ రెడ్డి, సతీష్  పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*