BREAKING
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి గాంధీ చూపిన సత్యమార్గంలో పయనిద్దాం: చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మీరు మా ఏపీ ముద్దుబిడ్డ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఆత్మకూరులో ఘనంగా లియాఫీ ఆవిర్భావ దినోత్సవం గ్రంథాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సంస్కరణల వలన పేద ప్రజలకు సంక్షేమం కలగాలి ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి మన్నవరప్పాడు లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి అద్దంకి అభివృద్ధికి పెద్దపీట ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు ఘనంగా జయంతి వేడుకలు యాదగిరిగుట్టలో భక్తజన సందోహం రూ.10 కోట్లకు చేరువలో సర్వేపల్లి సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ - మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన

బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం - టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున

Select Suryaa Now
బీసీల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నాం -  టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున

 

విజయనగరం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్:

తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ బీసీల పక్షపాతి అని, బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ  అధ్యక్షులు , డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను అడ్డుకునేందుకు కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్న కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లి పోరాడతామని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేసినట్లు వెల్లడించారు. కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. శుక్రవారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  

*బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే*


దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించిన నాటి నుంచే వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా విశేష ప్రాధాన్యత కల్పించారని నాగార్జున గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కళా వెంకట్రావు, కింజరాపు ఎర్రన్నాయుడు, గౌతు శ్యామసుందర శివాజీ వంటి దిగ్గజ నేతలతో పాటు జిల్లాలో పతివాడ నారాయణస్వామి నాయుడు, దివంగత కోళ్ల అప్పలనాయుడు, తెంటు టెంటు జయప్రకాష్ వంటి నాయకులకు సముచిత అవకాశాలు కల్పించి, తిరుగులేని ప్రజా నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కొనియాడారు.  

*సామాజిక న్యాయాన్ని అడ్డుకునే యత్నాలు సాగవు*

బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే, కొందరు కుట్రపూరితంగా కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక అభివృద్ధిని అడ్డుకుంటున్న వారి వైఖరిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన వర్గాలు ఇంకా ఎన్నాళ్లు చేతులు కట్టుకుని కూర్చుంటాయని ప్రశ్నిస్తూ, ఇటువంటి ఆటలను సాగనివ్వబోమని, బీసీల సంక్షేమం కోసం టీడీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.  

*త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి*

కులగణన, జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని, అయితే స్థానిక సంస్థలకు రావాల్సిన అభివృద్ధి నిధులు ఆగకూడదంటే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జరిగే లోపు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలన్నదే తమ ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్‌లతో భేటీల సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర స్థాయి అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాని కార్యదర్శి ప్రసాదుల లక్ష్మి వర ప్రసాద్, బోద్దుల నరసింగ రావు,తదితరులు పాల్గొన్నారు.