BREAKING
ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలి

ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

ఐజైయు పిలుపు మేరకు జనగామలో టీయుడబ్ల్యూజై ఆధ్వర్యంలో గాందీ విగ్రహానికి వినతి

జనగామ జిల్లా , సూర్య ప్రతినిధి అక్టోబర్ 02 మేజర్ న్యూస్ ):-

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజైయూ ) పిలుపు మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్  (టీయుడబ్ల్యూజై )జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.
జనగామ గాంధీ చౌరస్తా నుంచి జర్నలిస్టులు ర్యాలీగా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు.  గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిపరమైన భద్రత, ఉద్యోగ భద్రత, సామాజిక మరియు ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, జర్నలిస్టుల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజై   జై జనగామ జిల్లా అధ్యక్షులు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పార్నంది వెంకటస్వామి, జిల్లా కోశాధికారి ఓరుగంటి సంతోష్ , శ్రీబాష్యం శేషాద్రి, కొత్తపల్లి కిరణ్, కన్న పర్శరాములు, కెమిడి ఉపేందర్, గణేష్, జంపాల శ్రీనివాస్, శశిధర్, రాణాప్రతాప్, తిప్పారపు ఉపేందర్, రహమాన్, మండల మోహన్, ఆకుల మహేశ్, నాసగోని శ్రీనివాస్, లావు జైపాల్ రెడ్డి, యండి ఎజాజ్, బట్టమేకల రాజు, మణి, పాలబిందెల రవీందర్, అశీష్, బాలు, అంకుశ్, శ్రీను, జితేందర్, సోమేష్, చింతకింది కిష్టమూర్తి, శివరాం, పర్శరామ్, బాస్కర్, సాగర్, మదు, నవీన్, వేణుగోపాల్, మోహన్, కిరణ్, శ్రీను, ఓంకార్, బాస్కర్, ఎల్లయ్య, నరేష్,గోవర్ధన, బాస్కర్, తదితరులు పాల్గొన్నారు.