BREAKING
సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి

గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం

Select Suryaa Now
గాంధీ జయంతి స్ఫూర్తితో  సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం

*స్వర్ణాంధ్ర సాధనలో స్వచ్ఛాంధ్రకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి*:జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

*స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ

తిరుపతి మహాత్మా గాంధీ చూపిన సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ గత 16 సంవత్సరాలుగా అక్టోబర్ 2న వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
స్వచ్ఛత, సుందరీకరణ, వాయు కాలుష్య నివారణలో స్థానిక సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ లీగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి నగరం 2024, 2025 సంవత్సరాల్లో వరుసగా దేశవ్యాప్తంగా టాప్–3లో నిలవడం విశేషమని పేర్కొన్నారు.
స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛతా హి సేవా అవార్డులు–2026లో భాగంగా తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమీషనర్ జయకృష్ణ,  టిటిడి బోర్డు సభ్యులు మన బాక లక్ష్మి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ లతో కలసి పాల్గొన్నారు.
-----------
Raaju, బ్యూరో, ND సూర్య, తిరుపతి జిల్లా