BREAKING
కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం.. 19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్ పటిష్టమైన వృద్ధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్షలు: అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

Select Suryaa Now
నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

ఆలమూరు మేజర్ న్యూస్ ;

_కళ కళ కోసం కాదు, ప్రజల చైతన్యం కోసమేనని నిరూపిస్తూ 1943 నుంచి ప్రజానాట్యమండలి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోందని జిల్లా కన్వీనర్ వి. శామ్యూల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు.శనివారం ఆలమూరులోని సమతా కార్యాలయంలో సీనియర్ కళాకారుడు సాయిబాబు అధ్యక్షతన ప్రజానాట్యమండలి ఆలమూరు మండల మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రజానాట్యమండలి ప్రథమ జిల్లా మహాసభలు జరుగుతాయని వెల్లడించారు. అక్టోబర్ 24న యువత, మహిళల కోసం అభ్యుదయ పాటల శిక్షణా శిబిరం, 25న జిల్లా మహాసభ నిర్వహిస్తామన్నారు. దేశంలో పెరుగుతున్న విద్యార్థి, ప్రజా సమస్యలపై కళారూపాల ద్వారా చైతన్యం తెస్తామని, ఈ మహాసభలకు యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు._

*నూతన కమిటీ ఎన్నిక:*

_మహాసభలో ఆలమూరు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా యేసురాజు,అధ్యక్షుడిగా కర్రి సాయిబాబు, కార్యదర్శిగా ఎన్.చంద్రరావు ఎంపికయ్యారు. కమిటీ సభ్యులుగా ఈశ్వరి, రమణయ్య, భవాని, వరలక్ష్మి, రవికుమార్, సహవాసరావులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు యేసుదాసు,రామకృష్ణ, యాకోబు, పద్మ తదితరులు పాల్గొన్నారు._