పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు
పేరూరు గురుకులానికి ఆధునిక హంగులు!
* విద్యార్థుల కోసం నూతన డైనింగ్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన
రామగిరి మేజర్ న్యూస్ : రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత , ఆదేశాల మేరకు పేరూరు గురుకుల పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన డైనింగ్ హాల్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని వసతులతో కూడిన ఆధునిక డైనింగ్ హాల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని అధికారులు, నాయకులు కలిసి పరిశీలించి ఎంపిక చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే పేరూరు గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైనింగ్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు, అనుమతులు మంజూరు చేయించేందుకు చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో భోజనం అందేలా ఆధునిక వసతులతో డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక నాయకులు కోరారు.ఈకార్యక్రమంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సంజయ్ కుమార్, కరుణాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రామగిరి మండల కన్వీనర్ సుధాకర్, పాఠశాల విద్యా కమిటీ కోఆప్షన్ సభ్యుడు బోయ రామాంజనేయులు పాల్గొన్నారుపాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు