BREAKING
హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన సమరం.. నవంబర్ 20న మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సెన్సేషన్: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టచ్ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ

కూటమి పాలనలో జీ అగ్రహారానికి మహర్దశ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు

Select Suryaa Now
కూటమి పాలనలో జీ అగ్రహారానికి మహర్దశ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు


చీపురుపల్లి మేజర్ న్యూస్:

జి అగ్రహారానికి మహర్దశ పట్టిందని, రూ.50 లక్షలతో రహదారి మంజూరైందని శాసన సభ్యులు కిమిడి కళా వెంకటరావు చెప్పారు. 
రవాణా వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంతో సాగుతున్న 'పల్లె పండుగ 3.0' ఉత్సవాల్లో భాగంగా జీ అగ్రహారంలో రూ. 50.00 లక్షల వ్యయంతో చేపడుతున్న నూతన బి.టి. రహదారి నిర్మాణ పనులకు  శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు  శనివారం భూమిపూజ నిర్వహించారు.  పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల అలసత్వంతో ఛిద్రమైన పల్లె బాటలకు పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పటిష్టమైన ప్రణాళిక, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పల్లెల అభివృద్ధి పట్టుదల ఫలితంగానే  నియోజకవర్గంలో మూలమూలకూ రహదారి సౌకర్యం చేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. రాకపోకలకు వీలుగా నాణ్యమైన రహదారులను నిర్మించి, రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ప్రజలు సురక్షితంగా ప్రయాణించేందుకు నిరంతరం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రౌతు కాము నాయుడు ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, రామచంద్రుడు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, విసనగిరి శ్రీనివాసరావు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.