బాపట్ల రూరల్ సీఐ గా రాంబాబు
బాపట్ల, మేజర్ న్యూస్:బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ఎస్. సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిస్థితులపై సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఐ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడితో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.