సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రజా దర్బార్
చీపురుపల్లి మేజర్ న్యూస్:
చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శనివారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి మొత్తం 40 వినతులను స్వీకరించారు.
ప్రధానంగా విద్యుత్, డ్రైనేజీ, భూ సమస్యలు, రహదారులు, తాగునీరు, పింఛన్లు, సంక్షేమ పథకాలు తదితర సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే కి వినతులు అందజేశారు. ప్రతి వినతిని పరిశీలించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.