BREAKING
మున్సిపాలిటీ పై జెండా వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు

Select Suryaa Now
ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు

 

- ఓబీసీ రిజర్వేషన్లపై స్పష్టత కల్పించాలి

 

- గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ఒరిగేదేమీ లేదు

 

- మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ విమర్శలు


మదనపల్లె : ఓబీసీ రిజర్వేషన్లపై స్పష్టత కల్పించాలని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు.శనివారం మదనపల్లె పట్టణం,దొంతి వీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్లపై గత జగన్ ప్రభుత్వం,ప్రస్తుత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం స్పష్టత లేకుండా తకదిమితకదిమి ఆడుతున్నాయని ఆరోపించారు.ఈ నెల 13న దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.వంద సంవత్సరాల క్రితం తిరుపతిలో దళితుడు దేవాలయ ప్రవేశం చేయడంతో పోలీసులు అరెస్టు చేశారని,ఇప్పటికి వంద సంవత్సరాలు పూర్తి కావడంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు.మదనపల్లె నిర్వహించిన సభలో లక్ష కోట్లతో హార్టికల్చర్ హాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పేర్కొందన్నారు.వచ్చే ఆరు నెలల్లో దీని బండారం బయట పడుతుందన్నారు.ఈ హబ్ ద్వారా రైతులకు ఒరిగేది శూన్యమన్నారు.నిన్న రైతుల కోసం దేశ ఆర్థిక కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ మదనపల్లెకు వచ్చిందని,నేను మూడేళ్లుగా అడుగుతున్నా బ్యాంకుల్లో 16.5 లక్షల కోట్లు రూపాయలను రుణమాపీ చేసిననట్లు ప్రకటించారని,కానీ అందులో ఒక రైతుకైనా మాఫీ జరిగిందా అని ప్రశ్నించారు.వేల కోట్లు ప్రరిశ్రమల కోసం తీసుకున్న బడా బాబులకే రుణమాఫీ చేసిన ఘనత మోదీ,నిర్మలా సీతారమన్ కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ వేల కోట్లు భూములను ఉచితంగా దళితులకు పట్టాలు మంజూరు చేసిందని,మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత దళితులకు భూములను రిజర్వేషన్ చేసి పక్కాగా ఇస్తామని చెప్పారు.ఆర్టికల్ 46 భారత రాజ్యాంగంలో ఉందని ఇందులో ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు అందజేయాలని,గత ప్రభుత్వాలు వీటి పూర్తిగా పక్కన పెట్టాయని గుర్తుచేశారు.ప్రాంతీయ పార్టీలు ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.సోనియగాంధీ ఆశిస్సులతో ఓబీసీ 27 శాతం అమలు చేస్తే ఎంతో మంది ఓబీసీలు ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు సాధించారన్నారు.చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తప్పులు చేసి దొంగలా తిరుగుతున్నారని ఆరోపించారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా జ్ఞానేష్ కుమార్ ని పదవి నుంచి తొలగించాలని పెద్దఎత్తున్న ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ నేత షేక్ రెడ్డి సాహెబ్,యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్,నాయకులు విశ్రాంత ఎంఈఓ బండపల్లి ఈశ్వరయ్య,మీనాకుమారి,మహహ్మద్ ఆలీ,నాగరాజ తదితరులు పాల్గొన్నారు.