వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
ఆలమూరు మేజర్ న్యూస్ ;
_ శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వృద్ధులకు, నిరుపేదలకు అండగా నిలవడమే ధ్యేయంగా మాజీ సర్పంచ్ గుణ్ణం రాంబాబు శనివారం 50 మంది వృద్ధులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గుణ్ణం రాంబాబు మాట్లాడుతూ... రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, వయోవృద్ధులు చలి తీవ్రతకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమాజంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు తమవంతు సాయం అందించడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.దుప్పట్లు అందుకున్న వృద్ధులు తమకు ఈ కష్టసమయంలో తోడ్పాటు అందించిన మాజీ సర్పంచ్ గుణ్ణం రాంబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి యార్లగడ్డ రమేష్ చౌదరి, బీర అబ్బు, గంటా అర్జున్ రావు, నెల్లి సత్యనారాయణ, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు._