BREAKING
మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు సల్మాన్ ఖాన్ మాతృభూమి సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల అరుదైన సమరం.. నవంబర్ 20న మమ్ముట్టి వర్సెస్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ సెన్సేషన్: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి హాలీవుడ్ రేంజ్ టచ్ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ప్రాజెక్ట్పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమకు మణిహారం దాదా సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య అన్‌స్టాపబుల్ షో రాబోతుందా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం ఆలయాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: చినుకని శివ ప్రసాద్ కట్టరాంపూర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన మీరు ఉద్యోగం తో పాటు వ్యాపారం చేయాలనుకుంటున్నారా ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలందిచడమే ఏపీఎన్.ఆర్.టి లక్ష్యం ఈనెల 13న దళితుల దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 5న ప్రజావాణి కార్యక్రమం రద్దు •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందమే తనకు శాపమైంది.. చేతికొచ్చిన సినిమాలను కోల్పోయాను: నటి దియా మీర్జా

గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

Select Suryaa Now
గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా ఎన్‌. రాంరెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా ఎల్‌. సత్యప్రసాద్‌

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి: నూతన అధ్యక్షుడు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (అక్టోబర్‌ 3):గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం మేడ్చల్‌ జిల్లా శాఖ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, భౌరంపేట ప్రధానోపాధ్యాయులు ఎన్‌. రాంరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మేడిపల్లి ప్రధానోపాధ్యాయులు ఎల్‌. సత్యప్రసాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.రాష్ట్ర కౌన్సిలర్లుగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బాలానగర్‌ ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌. అరుణ్‌జ్యోతి, అలియాబాద్‌ ప్రధానోపాధ్యాయులు ఎల్‌.సి. గోపాల్‌ ఎన్నికయ్యారు. జిల్లా కోశాధికారిగా కొర్రేముల్‌ ప్రధానోపాధ్యాయురాలు డి. వరలక్ష్మి, గౌరవాధ్యక్షులుగా లాల్‌గాడి మలక్‌పేట్‌ ప్రధానోపాధ్యాయులు ఎంవీఎస్‌ శ్రీనివాస ప్రభాకర్‌ ఎన్నికయ్యారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి:
     ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎన్‌. రాంరెడ్డి మాట్లాడుతూ,.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులు, ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతంతో పాటు ప్రధానోపాధ్యాయుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు సంఘం తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు.నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజగంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్‌, కోశాధికారి తుకారం తదితరులు అభినందనలు తెలిపారు. సంఘం బలోపేతానికి నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్ బాల్ రెడ్డి.